హైదరాబాద్:ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన యువతి ఆస్మాబేగం శరీరంలో బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఇంకా తేల్చలేదు. ఆస్మా కుటుంబీకులు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. రెండేళ్లు దాటినా కూడ ఈ విషయాన్ని ఆస్మా కుటుంబసభ్యులు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారనే విషయమై స్పష్టత రాలేదు.

వెన్నునొప్పితో హైద్రాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆస్మా బేగానికి వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయాన్ని పోలీసులు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

రెండేళ్ల నుండి ఆమె వెన్నులో బుల్లెట్‌ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. రెండేళ్ల నుండి ఆమె ఇంట్లోనే  చికిత్స చేయించుకొంది. కానీ, ఈ విషయాన్ని ఆమె ఎందుకు బయటకు చెప్పలేదనే విషయం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

యువతి శరీరంలో బుల్లెట్‌కు సంబంధించి పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read:వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది

అయితే ఆస్మాబేగం శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆస్మా బేగం తండ్రి పనిచేసే ఫంక్షన్ హాల్ యజమాని కొడుకు గతంలో ఓ పెళ్లి బరాత్ సందర్భంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో  ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్: తెరపైకి జుబేర్ కాల్పుల కేసు

ఈ కేసు విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే నాటు వైద్యాన్ని ఆస్మా బేగం ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చి 10 రోజులు దాటుతున్నా కూడ బుల్లెట్ ఎలా ఆమె శరీరంలోకి దిగిందనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోయారా అని కొందరు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.