హైద్రాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద నగ్నంగా మృతదేహాలు: ప్రేమజంట హత్య
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జంట మృతదేహాలు కలకలం రేపాయి. ప్రేమ జంటను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఈ హత్య జరిగింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి.ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటను నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితమే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతీయువకులను హత్య చేసి మృతదేహాలను కాల్చివేశారు. శవాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. జాతీయ రహదారికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ శవాలు పడి ఉన్నాయి.
మృతి చెందిన యువకుడిని యశ్వంత్ గా గుర్తించారు. యువతి మృతదేహం నగ్నంగా ఉందియువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. నిందితులు వీరిని హత్య చేసిన తర్వాత గుర్తు పెట్టకుండా ఉండేందుకు దగ్దం చేసి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఆధారాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అబ్దుల్లాపూర్ మెట్ సీఐ వనస్థలిపురం ఏసీపీలు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యశ్వంత్ వారాసీగూడ బౌధ్దనగర్ ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. చనిపోయిన మహిళను జ్యోతి అని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ బ్యాగులో సెంట్రో చెప్పుల దుకాణంలో చెప్పులు కొనుగోలు చేసిన రశీదు లభ్యమైంది. ఈ రశీదుపై జ్యోతి అనే పేరు ఉంది. ఈ ప్రాంతం నుండి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్వాసన వచ్చే ప్రాంతానికి వెళ్లి పోలీసులు పరిశీలిస్తే రెండు డెడ్ బాడీలు కన్పించాయి.సంఘటన స్థలంలో జ్యోతి, యశ్వంత్ కి చెందిన వస్తువులను దూరంగా నిందితులు విసిరివేశారు. కానీ హోండా యాక్టివాను మాత్రం అక్కడే వదిలేశారు.
ఈ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ వద్దే సీసీటీవీ కెమెరాలున్నాయి. ఈ ఇద్దరితో పాటు ఇతరులు ఎవరైనా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
జ్యోతికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.. జ్యోతి బ్యాగులో ఉన్న చెప్పుల దుకాణంలో దొరికిన రశీదు ఆధారంగా ఆమెను గుర్తించారు. జ్యోతికి ఈ చెప్పులను శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పించాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ లో చెప్పాడు. ఫోలీసులతో ఫోన్ మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది.వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు