హైదరాబాద్: హైద్రాబాద్ వనస్థలిపుంలో వ్యాపారి గగన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు. గగన్ ను హత్య చేసి ఇంట్లోనే నౌసిన్ బేగం పూడ్చి పెట్టిన విషయం తెలిసిందే. 

మొదటి భార్యతో విడాకులు తీసుకొన్న తర్వాత నౌసిన్  బేగం  గగన్ అగర్వాల్  వివాహం చేసుకొన్నాడు.  నౌశియా బేగానికి కూడ గతంలో వివాహమైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. ఆమె కూడ మొదటి భర్తతో తెగదెంపులు చేసుకొంది. పిల్లలను పుట్టింట్లోనే వదిలేసి వెళ్లింది. తల్లి వద్దకు పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి వెళ్లేవారు.

పెళ్లికి ముందు ఆస్తి విషయంలో భర్త గగన్ అగర్వాల్ తో నౌసిన్ బేగానికి ఒప్పందం కుదిరిందనే ప్రచారం కూడా సాగుతోంది.ముగ్గురు కూతుళ్ల వివాహానికి ఆస్తిని ఇచ్చేందుకు అగర్వాల్ అంగీకరించినట్టుగా చెబుతున్నారు. అయితే పెళ్లైన కొంత కాలానికి  సునీల్ తో నౌనిస్ బేగానికి వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా భర్త  అగర్వాల్ గుర్తించాడు.

పెళ్లైన కొత్తలో అపార్ట్‌మెంట్ లో నివసించే సమయంలో తనను ఎవరో కిడ్నాప్ చేసి తన జుట్టును కత్తిరించారని నౌసిన్ బేగం అగర్వాల్ కు చెప్పింది. ఆ సమయంలో ఊళ్లో లేని అగర్వాల్ హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత అపార్ట్ మెంట్ వాచ్‌మెన్ ను విచారిస్తే అలాంటిదేమీ లేదని అగర్వాల్ కు తెలిసిందని పోలీసులు విచారణలో కనుగొన్నారు.దీంతో గగన్ తన నివాసాన్ని మన్సూరాబాద్ కు మార్చారు. 

ఈ విషయమై విచారించిన గగన్ అగర్వాల్ కు కీలక విషయాలు తెలిశాయి. తన మిత్రుడు సునీల్ తో నౌసిన్ కు వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా గుర్తించాడు. దీంతో ఆయన మద్యానికి బానిసగా మారాడు. ఈ విషయమై భార్యతో ఆయన గొడవకు దిగేవాడు. ఆస్తిని ఇవ్వనని భార్యకు తెగేసీ చెప్పినట్టుగా విచారణలో పోలీసులు గుర్తించారు.

also read:భర్త శవాన్ని ఇంట్లోనే పూడ్చిన నౌశిన్: స్థానికులను ఇలా నమ్మించింది

ఫిబ్రవరి 8వ తేదీన  సునీల్, గగన్ అగర్వాల్, నౌసిన్ మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న అగర్వాల్ ను నౌసిన్ కత్తితో పొడిచి చంపింది. సునీల్ అగర్వాల్ ను పట్టుకొంటే ఆమె కత్తితో పొడిచి చంపింది. ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గోతిలో అగర్వాల్ మృతదేహాన్ని పూడ్చివేశారు.ఈ కేసులో నౌసిన్ బేగంతో పాటు సునీల్ ను అరెస్ట్ చేశారు.