Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఉపశమనం..! అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్ మండలం సింగపూర్‌కు చెందిన కుమార్‌పై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
 

police filed case against the person who abused trs mla guvvala balaraju
Author
Karimnagar, First Published Nov 6, 2021, 8:06 PM IST

హైదరాబాద్: Huzurabad ఉపఎన్నిక ఫలితం Achampet ఎమ్మెల్యే గువ్వల బాలరాజును వెంటాడింది. సోషల్ మీడియాలో ఆయన విసిరన Challengeను హేళన చేస్తూ ట్రోలింగ్ చేశారు. నేరుగా ఫోన్లు కూడా చేసి ఇబ్బంది పెట్టారు. అయితే, ఇప్పుడు ఆయనకు కొంత ఉపశమనం లభించింది. TRS MLA Guvval Balarajuను టార్గెట్ చేస్తూ Socail Mediaలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై కరీంనగర్ Policeలు కేసు పెట్టారు. సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌నే గెలుస్తారని బల్లగుద్ది మరీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అంతేకాదు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక టీఆర్ఎస్ నమ్మకానికి గండికొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫలితం గువ్వల బాలరాజుకూ షాక్ ఇచ్చింది. బీజేపీ కార్యకర్తలు కొందరు ఆయన సవాల్‌ను ఎన్నిక ఫలితం తర్వాతా గుర్తు చేస్తున్నారు.

తాను రాజీనామా చేస్తానని విసిరిన సవాల్ ఏదని కొందరు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజును నిలదీశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగాయి. ఆయన పేరిట మీమ్స్ కూడా షేర్ అయ్యాయి. కొందరైతే నేరుగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి మరీ ఇబ్బంది పెట్టారు.

Also Read: ఆ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న ఉప ఎన్నిక భయం.. అసలు ఏం జరుగుతోంది...

ఈ ప్రశ్నలకూ గువ్వల బాలరాజు కూడా సమాధానమిచ్చారు. తాను సవాల్ చేసిన మాట వాస్తవమేనని, కానీ, తన సవాల్‌ను ఎవరూ స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ డబ్బులు వెదజల్లి గెలిచిందని ఆరోపించారు. బీజేపీ దౌర్జన్యాలు చేసి గెలిచిందని అన్నారు. కాబట్టి, తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల రాజు ఈ వివరణ ఇచ్చినప్పటికీ ట్రోల్స్ ఆగలేదు. ఆయనపై దుష్ప్రచారానికి బ్రేక్ పడలేదు.

Also Read: రేవంత్ పై గువ్వల ఫైర్

తాజాగా, ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడి వాట్సాప్‌లో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హుజురాబాద్ మండలం సింగపూర్‌కు చెందిన కుమార్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టరని భావించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios