బ్యూటీషియన్ శిరీష ది ఆత్మహత్యే. ఆమె మెడకు ఉరి వేసుకోవడం వల్లే చనిపోయింది. ఆమె మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరిపాము. నిందితులను విచారించాం. ఈ కేసులో శ్రావన్ అనే నిందితుడిని ఎ1 గా, రాజీవ్ ను ఎ2 గా గుర్తించాము. ఈ కేసులో తేజస్వినిపై ఎలాంటి కేసు లేదు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి శిరీషను అత్యాచారం చేయలేదు.

బ్యూటీషియన్ శిరీష మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆమెది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. అయినప్పటికీ ఆమె మరణం కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. అనూహ్యంగా శిరీష మరణం కేసులో ఎ1 గా శ్రావన్ వెలుగులోకి వచ్చాడు. ఎ2 గా రాజీవ్ ను గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు.

శిరీష ఆత్మహత్య వ్యవహారంలో నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ఆమన మాటల్లోనే..

గోదావరి జిల్లాలోని ఆచంట కు చెందిన విజయలక్ష్మి అలియాస్ శిరీష హైదరాబాద్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్నారు. ఆమెకు గత నాలుగేళ్లుగా వల్లభనేని రాజీవ్ తో స్నేహం ఉంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. ఇక బెంగుళూరులో పనిచేస్తున్న తేజస్విని అనే యువతితో రాజీవ్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. రాజీవ్ కు తేజస్విని మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆమె ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఇద్దరే శారీరకంగా కలిశారు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గత మూడు నెలల క్రితమే తేజస్విని హైదరాబాద్ బదిలీ చేయించుకుని వచ్చింది.

రాజీవ్ వ్యవహారిక తీరు పట్ల తేజస్వినిలో అనుమానం రేకెత్తింది. ఒకసారి ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆమెకు ఆశ్యర్యకరమైన సమాచారం తెలిసింది. రాజీవ్, ఆయన భార్య బయటకు వెళ్లారని అక్కడి ఆపీసు బాయ్ తేజస్వినికి చెప్పాడు. దీంతో వీరిద్దరి సంబంధాన్ని పసిగట్టింది తేజస్విని. తర్వాత వీరిద్దరితో తేజస్విని పలుమార్లు గొడివ పెట్టుకుంటూ వచ్చింది. ఒకసారి శిరీష, తేజస్విని ఇద్దరూ గొడవ పెట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ గొడవ ఆపలేక రాజీవ్ డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో వారిని పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. తర్వాత ఒకరిపై ఒకరు ఓరల్ కంప్లయింట్ ఇచ్చుకున్నారు. తర్వాత పలుమార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి.

వీరి గొడవలను శాశ్వతంగా పరిష్కరించునే ఉద్దేశంతో శ్రావన్ అనే తన స్నేహితుడిని కాంటాక్ట్ చేశాడు రాజీవ్. దీనికి తన స్నేహితుడైన కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఈ కేసును పరిస్కరిస్తాడని రాజీవ్ కు శ్రావన్ చెప్పాడు. దీంతోవారు ప్రభాకర్ రెడ్డికి కాల్ చేస్తే, బంజారాహిల్స్ లో ఎస్సై గా పనిచేస్తున్న హరీందర్ ను కలవమని చెప్పాడు.

ఈనెల 12న సాయంత్రం హరీందర్ ను శిరీష, రాజీవ్, శ్రావన్ కలిశారు. అప్పడు తాను బిజిగా ఉన్నానని వారం రోజుల తర్వాత కలవాలని హరీందర్ చెప్పాడు. దీంతోపాటు ఈ కేసును శ్రీనివాస్ అనే ఎస్సై చూస్తున్నందున ఆయనను కలవమని సలహా ఇచ్చాడు. ఇక లాభం లేదనుకున్న వారు వెంటనే పరిష్కరించుకోవడంపై ఆలోచించారు. వెంటనే కుకునూరుపల్లికి బయలుదేరారు.

ముగ్గురు కుకునూరు పల్లి వెళ్లే దారిలో అనీషా వైన్స్ లో రెడ్ లేబుల్ అనే మద్యం బాటిల్ కొనుగోలు చేశారు. రాయదుర్గం రెస్టారెంట్‌లో స్నాక్స్‌ తీసుకొన్నారు. 9గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ కు చేరుకున్నారు. రాత్రి 2.30 వరకు ఎస్సై క్వార్టర్‌లోనే నలుగురు ఉన్నారు. నలుగురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి, శ్రవణ్‌, రాజీవ్‌ ముగ్గురూ క్వార్టర్‌ నుంచి బయటికి వచ్చారు. అప్పుడు శిరీష కూడా బయటికొస్తానంది. అయితే సెంట్రీ చూస్తే ఇబ్బందవుతుందని ఎస్ఐ ఆమెకు చెప్పారు.

అదే సందర్భంలో రాత్రి 1.58 కి శిరీష తన భర్తకు లొకేషన్‌ను షేర్‌ చేసింది. ఇంటికి ఆలస్యంగా వస్తానని భర్త, కూతురికి చెప్పింది. రాత్రి 2 గంటలకు రాజీవ్‌కు శిరీష వాట్సప్‌ మేసేజ్‌ పంపింది. రాజీవ్‌, శ్రవణ్‌ బయట ఇద్దరు మాట్లాడుతుండగా ఎస్‌ఐ లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో ఎస్సై ఉన్న గదిలో అరుపులు కేకలు వినిపించాయి. తాను అలాంటి దాన్ని కాదని శిరీష కేకలు వేసింది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అరవొద్దని రాజీవ్‌, శ్రవణ్‌ బెదిరించారు. గొడవ ఎక్కువ అవుతుందని గ్రహించి శిరీషను తీసుకొని కారులో అక్కడి నుంచి బయలుదేరారు. కారులో వస్తున్నప్పుడు శిరీష ఏడుస్తూ గొడవ చేస్తూ ఉంది.

రన్నింగ్‌ కారులో శిరీష డోర్‌ ఓపెన్‌ చేసింది. దూకేందుకు ప్రయత్నించింది. కారు స్లో చేయగానే శిరీష పరుగెత్తడానికి యత్నించింది. శిరీషను జుట్టు పట్టి కారులోకి లాగి చెంప దెబ్బలు కొట్టాడు రాజీవ్. రాత్రి 3.45కి ఫొటోగ్రఫీ ఆఫీస్‌కు చేరారు. కారు డోర్‌ తీసి శిరీష అపార్ట్‌మెంట్‌లోకి పరిగెత్తింది. 3.47కి బయోమెట్రిక్‌ ద్వారా శిరీష డోర్‌ ఓపెన్‌ చేసింది. రాజీవ్‌, శ్రవణ్‌ అపార్ట్‌మెంట్‌ కింద ఉండిపోయారు. శిరీష ఇంకా బయటికి రావడం లేదని 3.55కి రాజీవ్‌, శ్రవణ్‌ పైకి వెళ్లారు.

ఆ తర్వాత ఏం జరిగిందంటే.....

3.59కి శ్రవణ్‌ను పంపించేందుకు రాజీవ్‌ క్యాబ్ బుక్‌ చేశారు

రాజీవ్‌ బిజీగా ఉండడం వల్ల శిరీష వీడియో కాల్‌ రిసీవ్‌ చేసుకోలేదు

రాజీవ్‌కు అనుమానం వచ్చి డోర్‌ను పగులగొట్టాడు

అప్పటికే శిరీష ఉరేసుకుని ఉంది

4.10కి శ్రవణ్‌కు కాల్‌ చేసి ఉరేసుకున్న విషయం చెప్పాడు

4.11కి 100 కాల్‌ చేసి ఉరేసుకున్న విషయం చెబితే పోలీసులు వెళ్లారు

4.19కి ఇంకా రాలేదు తొందరగా రావాలని శ్రవణ్‌ను రాజీవ్‌ కోరాడు

అప్పటికే ప్రాణం పోయింది, శవాన్ని మంచంపై పడుకోబెట్టారు

ఆ రాత్రి అపోలో ఆస్పత్రికెళ్లి అంబులెన్స్‌ తీసుకొచ్చారు

ప్రాణం లేదని వైద్యులు చెప్పారు

పోలీసులు శిరీష భర్త సతీష్‌చంద్రకు సమాచారం అందించారు

తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని భర్త చెప్పారు

రాజీవ్‌ విచారణలో తొలుత ఈ విషయాలన్నీ చెప్పలేదు

ప్రభాకర్‌రెడ్డికి హరీందర్‌ నాలుగు సార్లు కాల్‌ చేశారు

10.5కి హరీందర్‌కు ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ చేశారు

మీ దగ్గరికి వచ్చి లిక్కర్‌ తాగారని చెబుతున్నారని హరీందర్‌ చెప్పాడు

నేను తాగలేదని చెప్పి ఎస్సై ఫోన్ పెట్టేశాడు

శిరీష పెదవులపై గాయాలున్నాయి

శిరీష తలకు, కడుపులో గాయాలున్నాయి

విచారణ జరుగుతుండగానే ఉదయం 11.30 సమయంలో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు.