Asianet News TeluguAsianet News Telugu

ఆరు నెలలు 24 గంటలు నిఘా: అవంతి హేమంత్ తో పారిపోయిన వైనం ఇదీ...

హేమంత్ తో కలిసి పారిపోకుండా అవంతిని కుటుంబ సభ్యులు ఆరు నెలల పాటు నిర్బంధించారు, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టి 14 గంటలు నిఘా వేశారు. కానీ 10న విచిత్రంగా ఆమె పారిపోయింది.

Police confirms Hemanth murder as honor killing KPR
Author
Hyderabad, First Published Sep 28, 2020, 12:44 PM IST

హైదరాబాద్: హైదరాబాదులోని చందానగర్ కు చెందిన హేమంత్ ది పరువు హత్యగా పోలీసులు నిర్ధారించారు. తన కూతురు అవంతి కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే ఆమె కుటుంబ సభ్యులు హేమంత్ ను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. హేమంత్ ను ప్రేమిస్తున్న విషయం తెలిసిన తండ్రి లక్ష్మారెడ్డి ఆరు నెలల పాటు అవంతిని ఇంట్లో నిర్బంధించారు.

24 గంటలు కట్టడి చేయడానికి వీలుగా ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. 24 గంటల పాటు ఎవరో ఒకరు అవంతిని గమనిస్తూ వచ్చారు. ఆరు నెలల పాటు అలా అవంతిని ఇంట్లో నిర్బంధించారు. అయితే, జూన్ 10వ తేదీన కరెంట్ పోయింది. దీంతో సీసీటీవీ కెమెరాలు పనిచేయవని తెలిసి అవంతి హేమంత్ తో కలిసి పారిపోయింది. ఆ తర్వాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. 

Also Read: హేమంత్ హత్య కేసులో ట్విస్ట్: అవంతి ఆరోపణ... తెరపైకి మరో ఇద్దరి పేర్లు

సుపారీ గ్యాంగ్ తో హేమంత్ ను హత్య చేయించినట్లు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి అంగీకరించారు. పోలీసులు రీకన్ స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు. అందుకుగాను నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరటును కోరారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జహీరాబాద్ వద్ద సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. హేమంత్ హత్య కేసులో పోలీసులు 25 మంది నిందితులను గుర్తించారు. 

నిజానికి, ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉండేవి. లక్ష్మారెడ్డి ఇంట్లో ఏ వేడుక జరిగినా గానీ బోటిక్ హేమంత్ తల్లి చేసేది. ఈ క్రమంలో అవంతి, హేమంత్ మధ్య ప్రేమ చిగురించింది.

Also Read: హేమంత్‌ హత్య: నెల క్రితమే ప్లాన్.. అంతా యుగంధర్ కనుసన్నల్లోనే...

ఇదిలావుంటే, హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గొంతుకు తాడు బిగించడం వల్లనే హేమంత్ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. సంఘటన జరిగిన నాటి నుంచి హేమంత్ ఫోన్ ఆచూకీ లభించడం లేదు. పోలీసులు దాన్ని సేకరించే పనిలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios