తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హేమంత్ హత్యలో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. తన భర్త హత్యలో సందీప్ రెడ్డి, ఆశీష్ రెడ్డిల ప్రమేయం వుందని ఆరోపిస్తున్నారు అవంతి రెడ్డి.

హేమంత్ హత్యకు కొన్ని రోజుల ముందు సందీప్ రెడ్డి బెదిరించాడని, అతనితో తనకు ప్రాణహానీ వుందని అవంతి చెబుతున్నారు. హేమంత్ కిడ్నాపైన రోజు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Also Read:హేమంత్‌ హత్య: నెల క్రితమే ప్లాన్.. అంతా యుగంధర్ కనుసన్నల్లోనే

అంతకుముందు హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్‌ చేశారు. తమను వారంతా నమ్మించి మోసం చేశారని ఆమె వాపోయారు.

తనపై నిజంగా అంత ప్రేమ ఉంటే, తాను ప్రేమించిన హేమంత్‌ను చంపుతారా..? అని అవంతి నిలదీశారు. అమ్మానాన్నల కంటే అత్తామామే  తనను ఎక్కువగా ప్రేమిస్తారని ఆమె చెప్పారు. తమ ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని... అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారని అవంతి ఆవేదన వ్యక్తం చేశారు.

హత్యలో మేనమామలు పాత్రధారులు అవుతారని అనుకోలేదని ఆమె తెలిపారు. తన మేనమామలు విజేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి కలిసి కుటపన్ని ఇదంతా చేశారని అవంతి చెప్పారు.