ఆ దొంగలు దొరికారు

police catching thief
Highlights

  • వ్యాపారి బెదిరించి సొమ్ముతో పరారైన దుండగులు
  • నిందితుల్లో ఒకరు మాజీ హోం గార్డ్

హైదరాబాద్ లోని అత్తాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ దగ్గర బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులతో పరారైన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బంగారు వ్యాపారి నుంచి రవీందర్ రెడ్డి, రెడ్డయ్య రాజు, నరేష్ అనే ముగ్గురు నిందితులు రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లారు.

 

దీనిపై వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు  ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేశ్ కోసం గాలిస్తున్నారు. దుండగుల నుంచి రూ.37.29 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు

 

శంషాబాద్ డీసీపీ పద్మజ తెలిపారు. కాగా, వ్యాపారిని బెదిరించిన వారిలో ఒకరైన రెడ్డయ్య రాజు గతంలో హోంగార్డుగా పనిచేయగా, రవీందర్ రెడ్డి, నరేశ్ లు ఇంజనీరింగ్ విద్యార్థులు అని తెలిసింది.

 

loader