కట్టుకున్న భార్యపట్ల ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను వివస్త్రను చేసి ఆమె ఒంటినిండా వాతలు పెట్టాడు. ఈ దారుణ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వనపర్తి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కి వచ్చారు. నగరంలోనే పలుపనులు చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే... ఇటీవల భార్య ఎవరితోనే సంబంధం పెట్టుకుందనే అనుమానం భర్తలో కలిగింది. దీంతో భార్య ప్రవర్తపై అనుమానం అతనిలో రోజు రోజుకీ పెరిగిపోయింది.

దీంతో భార్యను వివిధ రాకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెడుతున్న టార్చర్ భరించలేని సదరు మహిళ ఎదరు తిరిగింది. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్యా పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అతను భార్య తలను ఇనుపరాడ్డుతో కొట్టాడు.

Also Read చంపేస్తామని బెదిరిస్తున్నారు... పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు..

తలకు తీవ్రగాయమై ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అదే అదనుగా చేసుకొని భార్యను వివస్త్రను చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై వాతలు పెట్టాడు. దానంతటినీ 14ఏళ్ల కొడుకు చేత వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందాడు.

తీవ్ర గాయాలతో బాధపడుతున్న సదరు మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో తప్పించుకుపోయి వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఒంటిపై గాయాలు చూసి చలించిపోయిన పోలీసులు ఆమెను ముందుగా ప్రాథమికి చకిత్స అందించారు. అనంతరం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్లో వీడియో చూసి పోలీసులు కూడా షాకయ్యారు. అయితే.. ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో చోటుచేసుకోవడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.