నిత్యం వివాదాస్పద ఆరోపణలతో సంచలనం సృష్టించే నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. లైంగిక ఆరోపణలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కలకలం రేపిన శ్రీరెడ్డి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ చెన్నై కమిషనరేట్ లో ఫిర్యాదు చేసింది.  బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాష్టర్ రాజేశ్ పై ఫిర్యాదు చేసింది.

Also Read బూతులు మొదలు పెట్టింది, మాట్లాడడం మానేశా.. శ్రీరెడ్డిపై మరో కేసు..

ఇంటకీ మ్యాటరేంటంటే... శ్రీరెడ్డి పై నటి కరాటే కళ్యాణణి, నృత్య దర్శకుడు రాజేష్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో శ్రీరెడ్డి తమ గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తోందని, సోషల్ మీడియాలో కావాలనే తమపై లేని పోని ఆరోపణలు చేస్తోందని వారు పేర్కొన్నారు. దీంతో అక్కడి క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు

ఈ నేపథ్యంలో కళ్యాణి, రాజేష్ లు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ శ్రీరెడ్డి చెన్నై పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. నటి శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అయితే తెలుగు నటి కరాటే కల్యాణి, నృత్యదర్శకుడు రాజేశ్‌ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పింది.

 తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు, తనను పెట్రోల్‌ పోసి తగల పెడతామని హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి చెప్పింది.