పనీపాట లేకుండా తిరుగుతుంటే.. మనవాడే కదా అని ఇంటికి తీసుకువచ్చాడు. తన ఇంటికి పక్కనే ఇళ్లు అద్దెకు ఇప్పించి.. పని కూడా కల్పించాడు. అలాంటి వ్యక్తి పట్ల గౌరవంతో ఉండాల్సిందిపోయి... అతని కూతురిపైనే కన్నేశాడు.  వరసకు తాను బాబాయి అవుతాననే విషయం మర్చిపోయి ప్రేమ పేరిట మాయమాటలు చెప్పాడు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా దౌల్తాపూర్ మండలం జమాల్ పూర్ కు చెందిన కేశవ్ కుమార్(20).. తనకేదైనా పని చూడాలని హైదరాబాద్ నగరంలో ఉంటున్న వరసకు అన్న అయ్యే వ్యక్తికి చెప్పాడు. అయితే.. పని దొరకడంతో 6నెలల క్రితం కేశవ్ కుమార్ వచ్చి బంధువు ఇంటి పక్కనే గదిలో అద్దెకు దిగాడు.

హౌస్ కీపింగ్ పనిలో చేరి.. అన్న కుటుంబంతో కలిసిమెలసి ఉండేవాడు. బాబాయి వరస కావడంతో తన కుమార్తె(14) కేశవ్ కుమార్ తో చనువుగా ఉన్నా కూడా ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే... కేశవ్ కుమార్ మాత్రం వావివరసలు మాని యువతికి ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఇంట్లో ఎవరికీ తెలికుండా బాలికను బెంగళూరు తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా... బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.