సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రగాయాలతో మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.