అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకు మోడీ.. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ సభలు
అక్టోబర్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్‌లో మోడీ రోడ్ షో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కమలనాథులు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా పలుమార్లు తెలంగాణకు వచ్చారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా ఖరారైంది. అక్టోబర్ మొదటి వారంలో మోడీ రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్‌లో మోడీ రోడ్ షో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు నరేంద్ర మోడీ. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.