ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. పాలమూరులో పసుపు బోర్డ్ సహా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ప్రకటనలు చేసిన నేపథ్యంలో మోడీ.. నిజామాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్‌లో దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. కాగా.. పాలమూరు బహిరంగ సభలో ప్రధాని మోడీపసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీపై కీలక ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో నేడు జరుగనున్న ప్రధానిమోడీ సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ప్రధాని మోడీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ దాదాపు రూ.8,000కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే..రూ. 1360 కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోడీ ప్రారంభిస్తారు. రూ. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య నిర్మించి రైలు మార్గాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు. సిద్దిపేట- సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.