ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ  అభివృద్ది  కోసం అంకిత భావంతో పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది కోసం అంకిత భావంతో పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఈరోజు వరంగల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో వేదికపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు. 

అనంతరం కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జాతీయ రహదారులు మెరుగయ్యాయని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రహదారుల అభివృద్దికి అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యేంతవరకు తెలంగాణలో 2,500 కి.మీ ఉంటే.. ఇప్పుడు అది 5 వేల కి.మీకు చేరిందని అన్నారు. 

Also read: భద్రకాళి అమ్మవారి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. గోశాలలో గో సేవ..

150 ఎకరాలలో రైలు మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. రోజుకు 7 వ్యాగన్ల చొప్పున ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీనికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని.. దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.