ప్రధాని మోదీ వరంగల్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాని మోదీ వరంగల్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరంగల్ మామనూర్ ఎయిర్‌స్ట్రిప్ చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని గోశాలలో ప్రధాని మోదీ గో సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల తర్వాత మోదీకి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ప్రత్యేకంగా సిద్దంగా చేసిన ప్రసాదాన్ని కూడా అందించారు.
ఇక, ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. భద్రకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. అలాగే గర్భగుడి వద్ద 5 నిమిషాల పాటు ధాన్యం చేసినట్టుగా తెలుస్తోంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో మోదీ వెంట అధికార యంత్రాంగం, అర్చకులు మాత్రమే ఉన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాలు హై ప్రొటెక్షన్ జోన్‌లోకి వెళ్లాయి. అమ్మవారి ఆలయాన్ని కూడా సర్వంగా సుందరంగా అలంకరించారు.
