ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దని అధికారులకు సీఎస్ ఆదేశించారు. ప్రధాని టూర్‌ను సక్సెస్ చేయాలని సూచించారు. అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని టూర్‌లో పాల్గొనేవారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని చెప్పారు. 

ప్రధాని తన పర్యటనలో భాగంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్నారు. ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహాన్ని (Statue Of Equality) ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా ఆశ్రమంలో

ఇక, ప్రధాని ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీజీ టీమ్ ఆశ్రమాన్ని సందర్శించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ అధికారులు.. ఆశ్రమంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అంతేకాకుండా ప్రధాని ఏయే ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుందనే వివరాలను కూడా సేకరించారు. ఈ క్రమంలోనే ఎస్పీజీ అధికారులు సెక్యూరిటీ పరంగా చిన్నపాటి సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. 

సమతామూర్తి విగ్రహా ప్రతిష్టను పురస్కరించుకుని భారీ బందోబస్తు చేస్తున్నట్టుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఇక, ముచ్చింతల్‌‌‌‌లోని ఆశ్రమంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నెతొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలైన ఈ ఉత్సవాలు.. ఈ నెల 14వతేది వరకు జరగనున్నాయి. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సహస్రాబ్ది వేడుకలకు పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. ఈ నెల 5వ తేదీన మోదీ పర్యటిస్తుంటే.. ఈ నెల 7న రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌, 8న అమిత్‌‌‌‌ షా, 13న రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ముచ్చింతల్‌కు రానున్నారు.