Asianet News TeluguAsianet News Telugu

ఇఫ్తార్ దుస్తుల పంపిణీ ఆపండి

రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు అందజేస్తున్న దుస్తుల పంపిణీ నిలిపివేయాలని ఓక సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. 60 కోట్ల మేరకు ప్రజాధనం వినియోగించడాన్ని  ఆ మహిళా కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

pil against kcrs iftar party

తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇఫ్తార్ సందర్భంగా పేద ముస్లిం ప్రజానీకానికి దుస్తులు పంపిణీ చేస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది సర్కారు.  అలాగే... క్రిస్టియన్ మతంలోని పేద వారికి సైతం క్రిస్మస్ సందర్భంగా బట్టల పంపిణీ చేపట్టింది. ఇక హిందూ మతంలోని పేద ప్రజానీకానికి కూడా దసరా, దీపావళి పండుగల వేళ దుస్తుల పంపిణీ చేపట్టేందుకు ఇప్పటికే సర్కారు ప్లాన్ చేస్తోంది. 

తెలంగాణ సర్కారు తీసుకుంటున్న ఈ చర్య వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈనెల 18న ఇఫ్తార్ సందర్భంగా 60 కోట్లతో దుస్తుల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముస్లిం పేదలకు కొత్త దుస్తులు ఇవ్వాలని ఏర్పాట్లు చేస్తోంది. మరి దీనిపై హైకోర్టు ఏవిధమైన ఆదేశాలు జారీ చేస్తుందో  చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios