Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పిటిషన్... హైకోర్టులో సీరియస్

తెలంగాణలో కరోనా రోజురోజుకు మరింత వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు సీనీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. 

petition filed on telangana high court over cm kcr health
Author
Hyderabad, First Published Jul 10, 2020, 1:13 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజురోజుకు మరింత వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు సీనీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రితో పాటు పలువరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇక సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్ లోనూ పలువురు సిబ్బందికి కరోనా సోకింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమవడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనరు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. 

అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరికీ సమాచారం లేదు. దీంతో ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం రాజకీయాల కోసం కోర్టులను వాడుకోవద్దని సూచించింది. ఈ పిటిషన్ ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. 

అయితే సీఎం ఆచూకీ కావాలంటే హెబియస్ కార్ప్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  

read more  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ కనబడుట లేదు, కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడం లేదు అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏమైపోయారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్ లో సిబ్బందికి కరోనా సోకగానే ఫార్మ్ హౌస్ కి కేసీఆర్ ఎందుకు మకాం మార్చారు అంటూ పలువురు నిలదీస్తున్నారు.  

 కేసీఆర్ కనబడుట లేదు, కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడం లేదు అంటూ, రాష్ట్రానికి పెద్దదిక్కు కనబడకుండా పోవడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల ఏకంగా ఒక ఇద్దరు యువకులు ప్రగతి భవన్ ముందు ప్లకార్డు పట్టుకొని హల్చల్ చేసారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ, ఆయన కనబడడం లేదు అంటూ హల్చల్ చేసి, పోలీసులు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే తప్పించుకున్నారు.   ప్రగతి భవన్ ముందుకు కూడా వచ్చి ప్రజలు కేసీఆర్ కనబడడం లేదు అని నినాదిస్తున్నారంటే... తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందొ, ప్రజలు కేసీఆర్ ని ఏ విధంగా మిస్ అవుతున్నారో అర్థమవుతుందని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. 
 
కేసీఆర్ కనబడడంలేదంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితుల గురించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ...  గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌  బుధవారం  హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అనంతరం ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్‌ కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ఆయన ఆరోగ్య బాగోగులు తెలియచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios