Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రజల్లో వున్న అనుమానాలను తొలగిస్తూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. 
 

minister srinivas goud comments on cm kcr health condition
Author
Hyderabad, First Published Jul 8, 2020, 12:56 PM IST

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగానే ఆయన ఫాంహౌస్ కు పరిమితమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో వున్న అనుమానాలను తొలగిస్తూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. 

''సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా? ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడుంటే ఏమిటీ? ఏ పథకమైనా ఆగిందా? ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆగిందా? కెసిఆర్ గట్టిగానే ఉన్నారు. ఆయనది బలమైన గుండె కాయ. సీఎం ఎంత గట్టి గా ఉన్నారో మాకు తెలుసు. ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు'' అని మంత్రి వెల్లడించారు. 

''కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు చూస్తుంటే తెలంగాణపై విషాన్ని చిమ్మడమే వారి పని అయినట్టుగా ఉంది. సొంత గడ్డకు ద్రోహం చేయడమే వారి విధానంగా కనిపిస్తోంది. ప్రతిదానికీ అడ్డుపడటం తప్పఈ రెండు పార్టీలకు ఏం చేతకాదు. పక్క రాష్ట్రాల వారు కూడా తెలంగాణ అభివృద్ధిని హర్షిస్తుంటే కొందరు ఇక్కడ పుట్టి ఇదే గడ్డపై విషం చిమ్ముతున్నారు'' అని మంత్రి మండిపడ్డారు. 

read more  కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

''పాత సచివాలయం బాగా పాడుబడ్డది. అయినా అందులోనే సంసారం చేయాలా? సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టే. హైకోర్టు తీర్పు కోసం ఏడాది ఓపిక పట్టాం. సచివాలయ నిర్మాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా మతి లేని మాటలు ఎందుకు? పాత సచివాలయం దేనికీ పనికి రాదు. అగ్ని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యులు?'' అని ప్రశ్నించారు. 

''తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతారా? అందరి నిజస్వరూపాలు సెక్షన్ 8 పై వారి మాటల ద్వారా బయటపడ్డాయి. ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం. తెలంగాణ అస్తిత్వంపై రాజీ పాడేది లేదు. మన తెలంగాణపై ఇతరుల పెత్తనం సహించేది లేదు. బానిస తెలంగాణను అనుమతించకే అప్పుడే స్వరాష్ట్రం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు ప్రాణాలకు తెగించి అయినా పరాయి మనస్తత్వ బానిస నేతలపై పోరాడతాం'' అని మంత్రి స్పష్టం చేశారు. 

''ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడ లేదు. ఆయన నైజం సెక్షన్ 8 పై మాట్లాడటంతో బయట పడింది. కాంగ్రెస్ ,బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలను కోల్పోయింది. సచివాలయ నిర్మాణం తో ప్రజా ధనం వృధా కాదు. ఉమ్మడి ఏపీ లో ప్రభుత్వ భూములను అప్పనంగా దోచి పెట్టిన వారికి ప్రజాధనం గురించి మాట్లాడే హక్కు లేదు'' అని మండిపడ్డారు. 

'' సీఎం కెసిఆర్ హాయాంలో తమ పప్పులు ఉడకడం లేదనే ఈర్ష్యతో కాంగ్రెస్ ,బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణపై ఆ రెండు పార్టీలు పగ పెంచుకున్నాయి. తెలంగాణ పై ఢిల్లీ పార్టీల పెత్తనం నడవదు. తెలంగాణ ప్రజలే తమకు కావాల్సింది తేల్చుకుంటారు. గవర్నర్ అధికారాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తమ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామీ రోజూ అక్కడి గవర్నర్ తో పేచీ పడుతున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి'' అని పేర్కొన్నారు.  

''తెలంగాణ కు కొత్త సచివాలయం ఓ ప్రతీక గా మారబోతోంది. వంద సంవత్సరాల పాటు కొత్త సచివాలయం తెలంగాణ పాలనా అవసరాలను తీర్చ బోతోంది. బీజేపీ నేతలకు బుద్ది చెడింది. తెలంగాణ కు కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా తేవడం చేత కాని బీజేపీ నేతలు కోతలు కోస్తున్నారు. కెసిఆర్ పట్టుదల ,దైర్యం ,స్థిరత్వం ఏమిటో ఆయన దీక్ష తో తెలిసింది'' అని అన్నారు. 

''ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రా వ్యక్తా? తెలంగాణ శత్రువులతో జత కలిశారా? సెక్షన్ 8 పై అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. పర్యావరణ నిబంధనల ప్రకారమే కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతుంది. కొత్త సచివాలయం నిర్మాణమయ్యాక కాంగ్రెస్ నేతల పిల్లలే అక్కడ సెల్ఫీలు దిగుతారు. సీఎం కెసిఆర్ తెలంగాణ గడ్డ మీద నుంచే పాలిస్తున్నారు. కొత్త పార్లమెంట్ పై లేని రాద్ధాంతం కొత్త సచివాలయంపై ఎందుకు? ప్రతిపక్షాలు చవక బారు విమర్శలు మానుకోవాలి'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios