పదో తరగతి హిందీ ప్రశ్రపత్రం లీక్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
హన్మకొండ: పదో తరగతి హిందీ ప్రశ్రపత్రం లీక్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో బండి సంజయ్ బెయిల్‌పై ఉన్నారు. అయితే బండి సంజయ్ బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం హన్మకొండ 4వ ఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపించారు. పోలీసుల విచారణకు సంజయ్ సహకరించడం లేదనిపేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో ఏ-6, ఏ-9 బెయిల్‌పై వాదానలు ముగిశాయి. అయితే హన్మకొండ 4వ ఎంఎం కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. ఇక, బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను జిల్లా కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా కోర్టు సూచన మేరకు హన్మకొండ 4వ ఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Also Read: వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..
Also Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. చంచల్‌గూడ జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారిస్తున్న ఈడీ..
ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు ఆయనపై 120 (బీ), 420, 447, 505(1), 4(ఏ), తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66(డీఐటీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత బండి సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ పిటిషన్‌పై 8 గంటలపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం బండి సంజయ్‌కు జడ్జి రాపోలు అనిత రూ.20 వేల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
