సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జా ద‌ర్బారుపై ప్ర‌జ‌ల అసంతృప్తి.. ఏం జ‌రిగింది అస‌లు?

Praja darbar: శుక్రవారం ఉదయం బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌కు మహిళలు సహా వందలాది మంది చేరుకుని వివిధ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతులు సమర్పించారు. అయితే, ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లిరావ‌డం, ప్ర‌భుత్వ స్పంద‌న, ఏర్పాట్లను గురించి ప్రస్తావిస్తూ ప్ర‌జా ద‌ర్బారుపై పలువురు అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. 
 

Peoples dissatisfaction with Telangana  CM Anumula Revanth Reddy's Praja Darbar, What happened? RMA

Telangana CM Revanth Reddy holds Praja Darbar: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అనుముల‌ రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా విని సత్వర పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్ లో గణనీయంగా జనం తరలివచ్చిన సందర్భంగా వికలాంగులకు ప్రాధాన్యమిచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రజాభవన్ వద్ద బారికేడ్లను తొలగించినప్పటికీ బేగంపేటలో ప్రజాదర్బార్ కోసం వందలాది మంది తరలిరావడంతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి.

ప్రజా దర్బారుపై అసంతృప్తి

ప్ర‌జా ద‌ర్బారు నేప‌థ్యంలో వందలాది మంది సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. అయితే తమను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజాభవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని మహిళలు వాపోతున్నారు. దీనికి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట జనం గుమిగూడారు. ఇతరులకు ప్రవేశం కల్పించకుండా పలు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు జనాన్ని సహకరించేలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "లోపల ఇప్పటికే 1000 మంది ఉన్నారు. ఈ రోజు మిమ్మ‌ల్ని అనుమతించలేం. దయచేసి సహకరించండి" అంటూ  అక్క‌డకు భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు చెబుతూ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీని నియంత్రించడానికి సరైన ప్రక్రియలు లేవని మహిళలు, సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read More: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపుల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

                   TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios