పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య సంచలనం సృష్టిస్తోంది. హైకోర్టు న్యాయవాది హత్యపై లాయర్ల సంఘాలు మండిపడుతున్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరుతున్నారు

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య సంచలనం సృష్టిస్తోంది. హైకోర్టు న్యాయవాది హత్యపై లాయర్ల సంఘాలు మండిపడుతున్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరుతున్నారు. దీనిపై రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవనున్నారు.

మరోవైపు హత్యకు దారి తీసిన పరిస్ధితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంధనిలో దేవస్థానం భూములకు సంబంధించి తండ్రి, సోదరుడిని కలిశారు వామన్ రావు. కుంట శ్రీనివాస్ వేసిన ఆలయ కమిటీ చెల్లుబాటు కాకుండా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు వామన్ రావు.

Also Read:లాయర్ దంపతుల హత్య.. ఆ ఎస్సైకి ముందే తెలుసు: పోలీసులపై శ్రీధర్ బాబు వ్యాఖ్యలు

2 గంటలకు సోదరుడు, తండ్రి సంతకాలు తీసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కుంట శ్రీను, వసంతరావు, అక్కపల్లి కుమార్ అనే ముగ్గురు మీదా పోలీసులు అనుమానం వుందని వివరించారు. కుంట శ్రీనివాస్ నిర్మించే ఇళ్లు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అంటూ వామన్ రావు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.