Asianet News TeluguAsianet News Telugu

యువతులను వ్యభిచారంలోకి దింపుతున్న నలుగురిపై పీడీ యాక్ట్

యువతులను వ్యభిచారంలోకి దింపుతున్న నలుగురు మహిళలపై పీడీ యాక్ట్ ను ప్రయోగించినట్టు యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు. పలు దఫాలు కౌన్సిలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో  పీడీ యాక్ట్ అమలు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

PD Act invoked against 4 women for illegal activities in Yadadri


యాదగిరిగుట్ట:యువతులను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న నలుగురు మహిళలపై యాదగిరిగుట్ట పోలీసులు పీడీ‌యాక్ట్ విధించారు.  ఈ నలుగురిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.  నిందితులపై ఇప్పటికే పలు కేసులున్నాయి.  పలు మార్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.దీంతో  పీడీ యాక్ట్‌ను అమలు చేసినట్టు  పోలీసులు ప్రకటించారు.

యాదగిరిగుట్టలో చాలా కాలం నుండి  వ్యభిచారం చేస్తూ జీవనం సాగించే కుటుంబాలు కొన్ని ఉండేవి. అయితే  స్వచ్ఛంధసంస్థలు, ప్రభుత్వం, పోలీసులు  వీరిని ఆ వృత్తిని మాన్పించి వేయాలని  చేసిన ప్రయత్నం ఫలించింది.

2016లో  వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని  జీవనం సాగించేవారిని వారిని  ఆ వృత్తిని మానేశారు. వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో చాలా కుటుంబాలు  ప్రత్యామ్నాయమార్గాల ద్వారా ఉపాధిని పొందుతున్నారు.  అప్పట్లో సుమారు 32 కుటుంబాలు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని జీవనం సాగించేవి. 

అయితే ప్రత్యామ్నాయమార్గాల ద్వారా ఉపాధిని పొందిన వారు కూడ కొన్ని సమయాల్లో వ్యభిచారం వైపు  మళ్లిన సందర్భాలు కూడ లేకపోలేదు.  అయితే  క్రమంగా ఆ వృత్తిని మానివేశారు.  అయితే ఇంకా నలుగురు మాత్రం ఇదే రకమైన వృత్తినే కొనసాగిస్తున్నారు.  పోలీసులు చెప్పినా వినకుండా ఆ నలుగురు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు.

ఈ నలుగురిపై ఈ ఐదేళ్ల కాలంలో  21` పీటా, 250 ఇతర కేసులు నమోదయ్యాయి. యువతులను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. పోలీసులు పలు దఫాలు కౌన్సిలింగ్ ఇచ్చినా  ప్రయోజనం లేకుండా పోయింది.

రక్షిస్తామనే పేరుతో యువతులను ప్రలోభపెట్టి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. వ్యభిచార గృహాలు నడుపుతున్న కంసాని సంధ్య, శశిరేఖ, బుచ్చమ్మ, నిర్మలపై పీడీ చట్టాన్ని అమలు చేశారు. తొలుత రక్షణ పేరుతో యువతులను తీసుకొచ్చి వారిని విలసాలను అలవాటు చేసి బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దింపేవారని పోలీసులు తెలిపారు.  పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేని కారణంగా  ఈ నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు పోలీసులు తెలిపారు.ఈ నలుగురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు పోలీసులు ప్రకటించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios