కేసిఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే శక్తి మీకే : ఉత్తమ్

pcc uttam fire on kcr at journalists garjana
Highlights

ఉత్తమ్ హాట్ కామెంట్స్

తెలంగాణ జర్నలిస్టుల గర్జన హైదరాబాద్ లో జరిగింది. ఈ సభలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లలోనే..

దేశానికి స్వాతంత్రం రావడంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారు. దేశంలో, రాష్ట్రంలో మీడియా అణచివేయబడుతుంది. అసెంబ్లీ లో ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులను ఎక్ స్పెల్ చేస్తున్నారు ఈ పాలకులు.

మీకు కెసిఆర్ కు దిమ్మ తిరిగే షాకిచ్చే శక్తి ఉంది. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్నివర్గాలను మోసం చేసినట్లే జర్నలిస్టులను కెసిఆర్ మోసం చేశారు.

కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయినా అందరికి అందుబాటులో ఉంటారు. ఈరోజు అది ఉందా...? కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇచ్చాం. 2019లో కాంగ్రెస్ మీ సహకారంతో అధికారంలోకి వస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని జర్నలిస్ట్ లకు ఇళ్లస్థలాలు, 5లక్షల వరకు హెల్త్ ట్రీట్ మెంట్, అందరికి అక్రిటిడేషన్ కార్డులు, మరణించిన జర్నలిస్టు లకు 3లక్షల వరకు పెంచుతూ మేనిఫెస్టో లో పెడతాం. జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచిత విద్యపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం.

loader