జనసేన పార్టీ అంటే గుండెల నిండా అభిమానం ఉన్నవారు రావాలి. రాజకీయాల ద్వారా దేశానికి సేవ చేయాలన్న సంకల్పం ఉండాలి. తెలుగు వారికి సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా జనసేనతో చేతులు కలపండి.

జనసేన ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతిభా పాటవాలు కలిగిన ఔత్సాహికుల ఎంపిక శిబిరాలను మిగతా జిల్లాల్లో సైతం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ లోని 7 జిల్లాల్లో, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు జనసేన పార్టీ ఈ ఎంపిక శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాల్లో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేసిన వారికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
మిగతా జిల్లాల్లో సైతం ఎంపిక శిబిరాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా తొమ్మది పాత జిల్లాల నుంచి ఔత్సాహికులు ఎంపిక కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరింది.
స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్ట్ విభాగాలకు తమ దరఖాస్తులను ఔత్సాహికులు ఆన్ లైన్ ద్వారా పంపాలని కోరింది. తమ దరఖాస్తులను పంపడానికి ఆన్ లైన్ లో జనసేన్ వెబ్ సైట్ లో లాగిన్ కావాలని కోరింది.
లాగిన్ కావాల్సిన వారు సంప్రదించాల్సిన అడ్రస్ జిల్లాలు వారీగా చూడండి.