పవన్ కల్యాన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, వెంటనే మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. 

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ బౌరంపేటలో వేసిన సెట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సెట్ తొలగిస్తుండగా థర్మకోల్ కు వెల్డింగ్ నిప్పుకణికలు అంటుకున్ని మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన చిత్ర యూనిట్ బృందం మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. దీనికి సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred