పానీపూరి ముసుగులో గంజాయి విక్రయం.. వ్యాపారి అరెస్ట్

Hyderabad: గంజాయి విక్రయిస్తున్న పానీ పూరీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. గంజాయికి హైదరాబాద్ లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో పానీపూరి వ్యాపారి  పానీ పూరితో పాటు గంజాయిని కూడా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు దొరికిపోయాడు. 

Pani Puri vendor arrested for selling ganja In Hyderabad RMA

Pani Puri vendor arrested for selling ganja: గంజాయి విక్రయిస్తున్న పానీ పూరీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. గంజాయికి హైదరాబాద్ లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో పానీపూరి వ్యాపారి  పానీ పూరితో పాటు గంజాయిని కూడా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు దొరికిపోయాడు. 

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం పానీపూరీ వ్యాపారిని అరెస్టు చేసి అతని నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అబిడ్స్ కు చెందిన ముస్తాపూర్ ప్రశాంత్ అనే వ్యక్తి అబిడ్స్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ గేటు ముందు కస్టమర్లకు గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నించాడు. తాజ్ మహల్ హోటల్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒకటి, భారతి విద్యాభవన్ రోడ్డులో మరొకటి ప్రశాంత్ పానీ పూరీ స్టాల్స్ నడుపుతున్నాడు. పెరిగిన రోజువారీ దుబారా ఖర్చులకు తన వ్యాపారం సరిపోకపోవడంతో హైదరాబాద్ లో గంజాయికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో విక్రయించేందుకు పథకం వేశాడు.

ఈ క్ర‌మంలోనే ధూల్ పేట జాలి హనుమాన్ కు చెందిన యశ్వంత్ అలియాస్ గౌతమ్ (25) అనే వ్యక్తి నుంచి గంజాయిని రూ.25 వేలకు కొనుగోలు చేసి కిలో రూ.45 వేలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన పథకం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేటు సమీపంలోకి వచ్చి కస్టమర్లకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఈ క్ర‌మంలో స‌మాచారం అందుకున్న పోలీస‌లు అతడిని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావు తెలిపారు.

త‌మిళ‌నాడులో 300 కిలోల గంజాయి పట్టివేత..

త‌మిళ‌నాడులోని తిరువారూర్ జిల్లా ముత్తుపేట సమీపంలోని తోవైకల్ మోనై వద్ద మంగళవారం 10 గోనె సంచుల్లో 307 కిలోల గంజాయి పట్టుబడింది.  బోటులో శ్రీలంకకు అక్రమ రవాణాకు తరలిస్తున్న గంజాయిని 'క్యూ' బ్రాంచ్ సీఐడీ బృందం అడ్డుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు నిందితులను నాగపట్నంలోని నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో సీఐడీకి అప్పగించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios