తెలంగాణ ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు.. : హరీశ్ రావు
Hyderabad: తెలంగాణలో ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందేలా చూస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆశా వర్కర్లకు నెలకు రూ.9750 వేతనం లభిస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని వారి సహచరులకు రూ.4000 నుంచి రూ.5000 మాత్రమే లభిస్తోందని అన్నారు.
Telangana health minister, T Harish Rao: తెలంగాణలో ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందేలా చూస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆశా వర్కర్లకు నెలకు రూ.9750 వేతనం లభిస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని వారి సహచరులకు రూ.4000 నుంచి రూ.5000 మాత్రమే లభిస్తోందని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలకు (ఆశాలకు) చేయూతనిస్తున్న నేపథ్యంలో గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలందరికీ (ఆశా) వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను గురించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఆశా, ఆక్సిలరీ నర్స్ మిడ్వైవ్స్ (ఏఎన్ఎం)లపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య సేవలకు, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్మికులు వెన్నెముక అని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంఎస్ ల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ రావు పేర్కొంటూ వారి సేవలను కొనియాడారు. వేతనాల పెంపు, సకాలంలో వేతనాలు ఇప్పించాలని ఆశా వర్కర్లు ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, కొత్త రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆశా వర్కర్లకు వేతనాలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆశా వర్కర్లకు నెలకు రూ.9750 వేతనం లభిస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని వారి సహచరులకు రూ.4000 నుంచి రూ.5000 మాత్రమే లభిస్తోందని తెలిపారు.
ఆశావర్కర్లు, ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల అమలుపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. 21 రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 14వ తేదీని తెలంగాణ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.