ఓయూ క్యాంపస్ లో ఉద్రిక్తత కరేంట్, నీరును కట్ చేసిన పోలీసులు పోలీసులతో ఘర్షణకు దిగిన విద్యార్థులు. నాన్ బొర్డర్ విద్యార్ధులను ఖాళీ చేస్తున్న విద్యార్థులు 

హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్శిటిలో విద్యార్థులు ద‌ర్నాకు దిగారు. శనివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్మానియాలోని హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపైకి వ‌చ్చారు. వంద‌లాది విద్యార్థులు రోడ్డు పైన కూర్చుని క్యాంప‌స్ అధికారుల‌కు, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

నెల రోజుల నుండి ఉస్మానియా లోని అధికారులు పోలీసుల సహాయంతో క్యాంప‌స్ లో నాన్ బొర్డ‌ర్ విద్యార్థులు హాస్ట‌ల్లో ఉండె వారిని ను ఖాళీ చేయిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీనికి నిరసనగా శనివారం విద్యార్థులు ధర్నాకు దిగారు.

 ప్రభుత్వం ఉస్మానియా విద్యార్థుల ను కావాల‌నే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అక్క‌డి విద్యార్థి నాయ‌కులు ఆరోపించారు.