హైదరాబాద్:తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సోమవారం నుండి సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లను   పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.

ఆయిల్ ట్యాంకర్ల యజమానులకు రవాణా ఛార్జీల్లో 80 శాతం కోత పెట్టాయి ఆయిల్ సంస్థలు. ఆయిల్ ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ సమ్మె కారణంగా తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో భారీగా ఆయిల్ ట్యాంకర్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఆయిల్ సంస్థలు దిగి రాకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయిల్ ట్యంకర్లను నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది.

ఈ విషయమై ఆయిల్ సంస్థలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి. ఈ సమయంలో ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేస్తే ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజీల్ లాంటి వాటికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలలను ఇవాళ్టి నుండే ప్రారంభించారు. రెడ్ జోన్లలో మాత్రం 33 శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ సమయంలో పెట్రోల్, డీజీల్ లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. 

also read:జగిత్యాలలో వృద్దుడికి కరోనా: అప్రమత్తమైన అధికారులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రాంతంలో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది.