Asianet News TeluguAsianet News Telugu

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు ఎన్టీఆర్..: మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్

Hyderabad: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరి వారసత్వం. తెలుగు ప్ర‌జ‌ల గుర్తింపు. విజయవాడలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఎన్టీఆర్ వెండితెరపై సూపర్ స్టార్ గా, రాజకీయాల్లో చెరగని ముద్రవేస్తూ కోట్లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుక‌ల క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

NTR is a great man who will remain in history forever: Minister Talasani Srinivas Yadav
Author
First Published May 28, 2023, 2:02 PM IST

NTR's 100th birth anniversary: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరి వారసత్వం. తెలుగు ప్ర‌జ‌ల గుర్తింపు. విజయవాడలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఎన్టీఆర్ వెండితెరపై సూపర్ స్టార్ గా, రాజకీయాల్లో చెరగని ముద్రవేస్తూ కోట్లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నివాళులు అర్పించిన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్.. ఎన్టీఆర్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే  గొప్ప మహనీయుడు, మ‌కుటం లేని మహారాజు అంటూ కొనియాడారు. 

తెలంగాణ‌ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల NTR ఘాట్ లోని ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  చిత్రపురి కాలనీ వద్ద, కూకట్ పల్లిలోని మోతీ నగర్ తో పాటు  KPHB కాలనీ లోని వసంత నగర్ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన NTR కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించారని పేర్కొన్నారు. నటుడిగా ఆయన ఏ పాత్ర లోనైనా అట్లే జీవించేవారనీ, ఆ పాత్రకే ఎంతో వన్నె తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారని తెలిపారు.  భగవంతుడు ఎలా ఉంటారో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో నేటికి ప్రజల మదిలో NTR నిలిచిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

చిత్ర పరిశ్రమ అభివృద్దికి, పరిశ్రమలోని ప్రతి ఒక్కరి అభివృద్దికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజలకు ఎంతో మేలు చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. తెలుగుజాతి గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు NTR అన్నారు. రాజకీయంగా ఎంతో మందికి భవిష్యత్ ఇచ్చారనీ, భౌతికంగా అయన మనతో లేనప్పటికీ ఎప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుడి శతజయంతిని నేడు తెలుగురాష్ట్రాలలోనే కాకుండా అనేక ప్రాంతాలు, దేశాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios