Asianet News TeluguAsianet News Telugu

చదువు ఖర్చు ఎక్కువైందని.. భార్యను విదేశాల్లో ఒంటరిగా వదిలేశాడు.. ఎన్నారై భర్త ఘాతుకం..

పెళ్లైన ఐదేళ్లకు భార్యను విదేశాల్లో ఒంటరిగా వదిలేశాడో ఎన్నారై. ఆమె చదువుకు అయ్యే ఖర్చు ఎక్కువవుతుందని ఈ అరాచకానికి ఒడిగట్టాడు. 

 

NRI left his wife alone abroad - bsb
Author
First Published Feb 23, 2023, 9:33 AM IST

హైదరాబాద్ : విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఎక్కువ కట్నాలు ఇచ్చి..  కూతుర్లకు పెళ్లిళ్లు చేయడం..  విదేశాలకు పంపిస్తే   కూతురు సుఖంగా ఉంటుందని తల్లిదండ్రులు  సంతోషపడతారు. అయితే ఈ ఎన్నారై సంబంధాలు చివరికి మోసాలతో అంతమయ్యే ఘటనలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.  తాజాగా ఇలాంటి ఓ ఘటన హైదరాబాదులో  వెలుగు చూసింది.  పెళ్లై, విదేశాలకు వెళ్లిన తరువాత  అక్కడ  పీజీ చేద్దామనుకున్న అమ్మాయి విషయంలో  అనుకోని  ఎదురుదెబ్బ  తగిలింది. భార్య చదువు ఖర్చు భారమైందని ఆ ఎన్నారై భర్త  విదేశాల్లో ఆమెను ఒంటరిగా వదిలేశాడు. 

విషయం తెలిసిన హైదరాబాదులోని ఆమె తల్లిదండ్రులు అల్లుడికి  నచ్చజెప్పడానికి ప్రయత్నించగా..  అతను ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు.  అల్లుడి తల్లిదండ్రులను సంప్రదిస్తే..  వారిద్దరికీ పడడం లేదంటూ వారు కూడా ఈజీగా తప్పించుకున్నారు.  దీంతో ఏం చేయాలో పాల్గొని అమ్మాయి తల్లిదండ్రులు గచ్చిబౌలి  మహిళా పోలీసులను ఆశ్రయించారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాదులోని మాదాపూర్ జోన్ కు చెందిన ఓ యువతి డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీ పూర్తి కాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం  చేయాలనుకున్నారు. అలా  ఐదేళ్ల క్రితం ఆమె వివాహం జరిపించారు.

హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం: బైక్ రేసింగ్ అడ్డుకున్న యువకుడిపై కత్తితో దాడి

మ్యాట్రిమోనీ సైట్ లో వెతకడం ద్వారా అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ సంబంధాన్ని కుదిర్చారు.  అతను యూఎస్ లోని వర్జినియాలో ఉద్యోగం  చేస్తున్నాడు. దీంతో తన కూతురు విదేశాల్లో సంతోషంగా ఉంటుందన్న ఆలోచనతో తల్లిదండ్రులు వారిద్దరి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తర్వాత ఈ జంట వర్జీనియాకు వెళ్ళిపోయింది.  అక్కడ కొంతకాలం వీరిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. 

అయితే,  డిగ్రీ వరకు చదివి ఆపేసిన ఆ యువతి తన చదువు కంటిన్యూ చేద్దామనుకుంది. ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్ కి అప్లై చేసింది. ఆమెకు అక్కడ సీట్ వచ్చింది. యూనివర్సిటీలో చేరిన తర్వాతే భర్త అసలు రంగు బయటపడింది.  భార్య చదువు తనకు ఆర్థికంగా భారంగా మారిందని భావించిన సదరు భర్త ఆమెను దూరంగా పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ విషయాన్ని ఆ మహిళ  ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు తెలిపింది. వారు అల్లుడితో మాట్లాడడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అల్లుడు తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నిస్తే వారిద్దరికీ పడడం లేదంటూ వారు తప్పించుకున్నారు.  దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో  గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. విదేశాల్లో కూతురు పడుతున్న అవస్థల మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు  ఇండియాలో ఉన్న సదరు యువకుడి తల్లిదండ్రులను  ప్రశ్నించగా.. విదేశాల్లో వారిద్దరికీ సరిగా పడడం లేదని తామేం చేయలేమని వారు చేతులు దులిపేసుకున్నారు. 

దీంతో ఇండియాలో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులే.. యువతీకి అక్కడ విదేశాల్లో కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. ఎన్నారై సంబంధం అనగానే వెనకా, ముందు ఆలోచించకుండా పెళ్లిళ్లు చేయకూడదని.. అన్ని విషయాలు.. అక్కడ అతని ఆర్థికపరిస్థితి, సామాజిక భద్రత కనుక్కున్న తరువాత ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios