రేవంత్ నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు టిఆర్ఎస్ లోకి జంప్ చక్రం తిప్పిన జిల్లా మంత్రులు కాంగ్రెస్ రేవంత్ కు తొలి షాక్ ఇస్తామంటున్న మంత్రులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రేవంత్ రెడ్డికి అధికార టిఆర్ఎస్ పార్టీ తొలి షాక్ ఇచ్చింది. రేవంత్ టిడిపిలో ఉండగానే పలవురు రేవంత్ అనుచరులను నయానో, భయానో టిఆర్ఎస్ లో చేర్పించుకుని హడావిడి చేసింది టిఆర్ఎస్. అయితే తర్వాత కొందరు తిరిగి రేవంత్ గూటికి చేరిన దాఖలాలు కూడా ఉన్నయి.
అయితే సోమవారం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి తన అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎలాగైనా రేవంత్ కు, ఆయనను చేర్చుకున్న కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేసింది. దీంతో కొడంగల్ లో ఈ పరిణామం ఒక కుదుపు గా చెప్పవచ్చు.
కోస్గి మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ఇవాళ సాయంత్రం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ బలం అనూహ్యగా పెరిగిపోతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 30 వాహనాల్లో కోస్గి ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ తోపాటు వారి అనుచరులు హైదరాబాద్ రానున్నారు. వారంతా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలకనున్నారు.
కోదండరాం తో చేతులు కలిపిన టిడిపి తమ్ముళ్లు
ఈ వీడియో తోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
