Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గురుకులాల్లో 9 వేల పోస్టుల భర్తీకి కసరత్తు.. డిసెంబర్‌లో కొలువుల జాతరే..?

తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని 9,096 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

notifications may released in december for recruiting telangana gurukul posts
Author
First Published Nov 26, 2022, 2:36 PM IST

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఖుషీ చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని 9,096 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో బోధన, బోధనేతర పోస్టులు వున్నాయి. అయితే గత కొంతకాలంగా గిరిజనల రిజర్వేషన్లలో సమస్యలు.. ఇతర అడ్డంకుల కారణంగా నోటిఫికేషన్ల జారీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే మరికొద్దిరోజుల్లోనే గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుంది. ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను గురుకులాల నియామక బోర్డు పరిశీలించేందుకు సిద్ధమైంది. దీనిపై సమీక్ష అనంతరం మార్పులు చేర్పులు చేయనుంది. ఈ తర్వాతే నోటిఫికేషన్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది బోర్డ్. 

ALso REad:నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అనుమతి

కాగా... గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 

ఇకపోతే.. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా..  త్వరలోనే గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిలో మరికొన్ని పోస్టులను చేర్చుతున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్-3 మరో రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులు  చేర్చుతున్నట్టుగా బుధవారం (నవంబర్ 23) ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో జారీ చేసిన జీవో నెం. 55లో సవరణలు చేపినట్టుగా తెలిసింది. ఈ నిర్ణయంతో గ్రూప్-2, 3, 4 పోస్టుల్లో భర్తీ చేసే ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


గ్రూప్-2లో చేర్చిన పోస్టులు..
1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సర్వీసు)
2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
3. జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ 
4. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
5. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
6. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

గ్రూప్-3లో చేర్చిన పోస్టులు..
1. గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
2. సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌వోడీల్లో ఇదే విధమైన పోస్టులు

గ్రూప్-4లో చేర్చిన పోస్టులు..
1. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
2. జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్పేర్ డిపార్ట్‌మెంట్)
3. మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
4. మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్)
 

Follow Us:
Download App:
  • android
  • ios