Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 

telangana govt green signal for group 4 recruitment
Author
First Published Nov 25, 2022, 7:06 PM IST

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 

ఇకపోతే.. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా..  త్వరలోనే గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిలో మరికొన్ని పోస్టులను చేర్చుతున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్-3 మరో రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులు  చేర్చుతున్నట్టుగా బుధవారం (నవంబర్ 23) ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో జారీ చేసిన జీవో నెం. 55లో సవరణలు చేపినట్టుగా తెలిసింది. ఈ నిర్ణయంతో గ్రూప్-2, 3, 4 పోస్టుల్లో భర్తీ చేసే ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


గ్రూప్-2లో చేర్చిన పోస్టులు..
1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సర్వీసు)
2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
3. జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ 
4. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
5. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
6. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

గ్రూప్-3లో చేర్చిన పోస్టులు..
1. గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
2. సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌వోడీల్లో ఇదే విధమైన పోస్టులు

గ్రూప్-4లో చేర్చిన పోస్టులు..
1. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
2. జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్పేర్ డిపార్ట్‌మెంట్)
3. మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
4. మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్)
 

Follow Us:
Download App:
  • android
  • ios