హైదరాబాద్: చైనా సరిహద్దులో ఇండియా సైనికుల మృతికి కారణమైన  చైనా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని హైద్రాబాద్ వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 15వ తేదీన లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయ వద్ద ఇండియా, చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణల్లో ఇండియాకు చెందిన 20 మంది సైనికులు మరణించారు.
ఇండియా ఆర్మీని పొట్టనపెట్టుకొన్న చైనా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు హైద్రాబాద్ జనరల్ వ్యాపారుల సంఘం నిర్ణయం తీసుకొంది.

బేగంబజార్, ఫీల్ ఖానా, సిద్ది అంబర్ బజార్, ఉస్మాన్ గంజ్, ఎస్ఎస్ రోడ్డు పరిధిలోని హోల్ సేల్ దుకాణాల్లో చైనా వస్తువులను విక్రయించవద్దని తీర్మానం చేశారు.

also read:చైనా వస్తువులను బహిష్కరించాలి: ప్రజలకు కేంద్ర మంత్రి పాశ్వాన్ పిలుపు

హైద్రాబాద్ హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఇవాళ ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకే చైనా వస్తువులను విక్రయించాలని తీర్మానించిందన్నారు.
రానున్న రోజుల్లో చైనాతో సహా ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోకుండా చట్టం తీసుకొస్తున్నట్టుగా కేంద్ర మంత్రి పాశ్వాన్ ప్రకటించారు.

మరోవైపు వ్యాపారులు, కస్టమర్ల భద్రతను కూడ నిర్ధారించాలని కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు.