తెలంగాణలో ఎవరితో పొత్తులు లేవు: తేల్చేసిన బీజేపీ నేత సునీల్ థియోధర్

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ నేత సునీల్ ధియోధర్  చెప్పారు.

No alliance with any party in Telangana says  BJP Leader Sunil Deodhar lns

హైదరాబాద్: తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని బీజేపీ నేత సునీల్ థియోధర్ తేల్చి చెప్పారు.గురువారంనాడు బీజేపీ  నేత సునీల్ ధియోధర్  ఖమ్మంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు  వచ్చారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ కార్యాలయంలో  మీడియాతో  మాట్లాడారు.   తెలంగాణలో ఎవరితో తాము పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. తాము తెలంగాణ ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.

కేసీఆర్ ఒక స్టిక్కర్ బాబుగా ఆయన పేర్కొన్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా  కేసీఆర్ చెప్పుకుంటున్నారని సునీల్ థియోధర్ విమర్శించారు.తెలంగాణ నుండి కేసీఆర్ ను బయటకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో  ప్రజలు బీజేపీకి ఆశీర్వాదం ఇస్తారని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది.ఈ మేరకు గత కొంతకాలంగా ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణను అమలు చేస్తుంది. సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలో పనిచేస్తుంది.  మరో వైపు ఈ నెల  5వ తేదీన 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించి  పలు అంశాలపై ఈ కమిటీలను ఏర్పాటు చేశారు.

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పక్కా ప్లాన్‌తో కమల దళం,అసెంబ్లీకో ఇంచార్జీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఈ నెల  9వ తేదీన  ఈసీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.  ఈ ఏడాది నవంబర్  30న పోలింగ్ జరగనుంది.  డిసెంబర్ 3న  ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో  అధికారాన్ని దక్కించుకోవాలని  బీజేపీ, కాంగ్రెస్,  బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి.  ఈ మూడు పార్టీలు అధికారం కోసం అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.  ఇప్పటికే  అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  ఈ నెల 15న బీజేపీ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  బస్సు యాత్ర తర్వాత  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios