Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పక్కా ప్లాన్‌తో కమల దళం,అసెంబ్లీకో ఇంచార్జీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  బీజేపీ ఫోకస్ పెంచింది.  నియోజకవర్గానికి ఒక ఇంచార్జీని నియమించింది. 

BJP Focuses on Telangana Assembly Elections 2023 lns
Author
First Published Oct 12, 2023, 12:29 PM IST

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ మరింత పెంచింది.  రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తను  బీజేపీ  నియమించింది.  రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్ కు కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు  ఈ బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించింది.  జిల్లా కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. మరో వైపు  రాష్ట్రంలోని  38 జిల్లాలకు  పార్టీకి చెందిన కీలక నేతలకు బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ నాయత్వం  రాష్ట్రంపై కేంద్రీకరించింది.  ఈ నెల 1, 3 తేదీల్లో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.  ఈ నెల 1న మహబూబ్ నగర్, ఈ నెల 3న నిజామాబాద్ లో జరిగిన  సభలో  మోడీ ప్రసంగించారు.  అంతేకాదు వేల కోట్ల రూపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.ఈ నెల  6న బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  హైద్రాబాద్ కు వచ్చారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో  జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ నెల 10న ఆదిలాబాద్ లో జరిగిన  సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 

ఈ నెల  15న తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని  బీజేపీ నాయకత్వం భావిస్తుంది.ఈ మేరకు ఆ పార్టీ నేతలు  కసరత్తు చేస్తున్నారు.  పార్టీ టిక్కెట్ల కోసం ఆరు వేలకు పైగా ధరఖాస్తులు వచ్చాయి.అయితే  ఎలాంటి ఇబ్బందులు లేని  స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని  బీజేపీ నాయకత్వం భావిస్తుంది.

also read:ఈ నెల 15 లేదా 16న బీజేపీ అభ్యర్థుల జాబితా: 35 మందికి జాబితాలో చోటు దక్కే చాన్స్

అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో ఏర్పాటు వంటి అంశాలపై  14 కమిటీలను ఆ పార్టీ ఏర్పాటు చేసింది.ఈ నెల  5వ తేదీన  ఈ కమిటీలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.  ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తులను తమవైపు ఆకర్షించేందుకు కూడ ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ఆలస్యం కావడానికి  వలసల అంశం కూడ కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios