అరాచకశక్తులను పెంచిపోషించింది: భువనగరిలో కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు

జనగామ సభ ముగించుకొని  భువనగిరిలో ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పై  సీఎం విమర్శలు చేశారు. 

No 24 hours electricity to Farmers if Congress won in Telangana lns

భువనగిరి: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ  అరాచక శక్తులను  పెంచిపోషించిందని  తెలంగాణ సీఎం కేసీఆర్  ఆరోపించారు. సోమవారంనాడు భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.  జనగామ సభలో పాల్గొని అక్కడి నుండి భువనగిరి సభకు చేరుకున్నారు  సీఎం కేసీఆర్ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉందన్నారు. మన ప్రగతికి ఏది మంచిదో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  మళ్లీ అరాచకశక్తులు పెరిగే అవకాశం ఉందని  కేసీఆర్ ఆరోపించారు. రెవిన్యూలో అవినీతిని తగ్గించేందుకు ధరణిని తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ధరణిని తీసేస్తుందన్నారు. ధరణిని రద్దు చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కౌలు రైతు, వీఆర్ఓల బెడద వస్తుందని  కేసీఆర్  చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  దళారుల రాజ్యం వస్తుందన్నారు.ఈ విషయమై  అప్రమత్తంగా ఉండాలని  కేసీఆర్ ను ప్రజలను కోరారు. 

also read:బంగాళాఖాతంలో కలపండి:జనగామ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ (వీడియో)

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  పైరవీకారులు,దళారులు వస్తారని కేసీఆర్ విమర్శించారు.అంతేకాదు రైతులు కూడ ఇబ్బందిపడుతారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ తో ప్రమాదం పొంచి ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ మాయం కానుందన్నారు. మూడు గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ కు షాకివ్వాలని ఆయన కోరారు.రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.భువనగిరిలో  స్పెషల్ ఐటీ హబ్, ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.భువనగిరిలో  50 వేల మెజారిటీతో పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పారు.

21 రోజుల పాటు  సీఎం కేసీఆర్ విస్తృతంగా ఎన్నికల సభల్లో పాల్గొంటారు.  ప్రతి రోజూ కనీసం రెండు సభల్లో కేసీఆర్ పాల్గొనేలా  బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అభ్యర్థుల ప్రకటనతో పాటు  అభ్యర్థులకు బీ ఫారాలు కూడ బీఆర్ఎస్ అందించింది.  కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించింది . బీజేపీ  ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు.కానీ ఆ పార్టీ అగ్రనేతలు  రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios