ఉత్తమ్‌కి జబ్బుచేసింది... ఇంజక్షన్ ఇచ్చి రక్తం ఎక్కించండి : కవిత

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపి కవిత ద్వజమెత్తారు. ఉత్తమ్ ఏదో జబ్బుతో బాధపడుతున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. ఆ జబ్బును నయం చేయడానికి ఆయనకు గులాబీ మందుతో ఇంజక్షన్ ఇవ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీలను కవిత కోరారు. అవసరమైతే ఉత్తమ్‌కు గులాబి రక్తం ఎక్కించి సోయిలోకి తీసుకురావాలన్నారు.

nizamabad mp kavitha fires on tpcc chief uttam kumar reddy

సోమవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తెలంగాణ ఆర్.ఎం.పి, పి.ఎం.పి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సులో కవిత పాల్గొని  ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ, పి.ఎం.పి సంఘాలకు మాత్రమే గుర్తింపునిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఆర్ఎంపీల సంఘాలకు గుర్తింపు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా అండదండలు అందించిందని కవిత పేర్కొన్నారు.

nizamabad mp kavitha fires on tpcc chief uttam kumar reddy

  గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వచ్చిన చికిత్స కోసం ఆర్ఎంపీల వద్దకే వెళ్తారన్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్  అధికారంలోకి రాగానే ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు పారా మెడిక్ లుగా గుర్తింపునిచ్చేందుకు ప్రభుత్వం  జీవోను జారీ చేసిందని అన్నారు.  వారికి శిక్షణ కూడా ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులను కేటాయించిందని తెలిపారు. అయితే పోచమ్మ పొతం చేస్తే... మైసమ్మ మాయం చేసింది.. అన్నట్లుగా కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లాయని ఎంపీ కవిత తెలిపారు.

nizamabad mp kavitha fires on tpcc chief uttam kumar reddy

వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్న  6 సెంటర్లు కూడా మూతపడాలని వారు కోరుకున్నారని అయితే ముఖ్యమంత్రి ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు అండగా నిలవడం ఆ కేసులు కొట్టేయడం జరిగిందని కవిత వివరించారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి లను కడుపులో పెట్టుకుంటామని... వారికి ఇవ్వాల్సిన సర్టిఫికేషన్ కార్యక్రమం పూర్తయ్యేలా చూస్తామన్నారు.

nizamabad mp kavitha fires on tpcc chief uttam kumar reddy

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్.ఎం.పి పి.ఎం.పి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిడిపల్లి వెంకన్న, ప్రధాన కార్యదర్శి జి బాలరాజు, సలహాదారు బి. వెంకటేశ్వర్లు, పసునూరి సత్యనారాయణ, రవీంద్ర చారి తో పాటు 31 జిల్లాల సంఘం బాధ్యులు పాల్గొన్నారు. 

nizamabad mp kavitha fires on tpcc chief uttam kumar reddy

సంబంధిత వార్తలు

మున్నూరు కాపులకు కవిత ఇచ్చిన హామీ ఇదే..

గొర్రెల కాపరిని సర్‌ప్రైజ్ చేసిన ఎంపీ కవిత ( వీడియో)

రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్: ఎంపీ కవిత

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios