మున్నూరు కాపులకు కవిత ఇచ్చిన హామీ ఇదే..
మున్నూరు కాపు కార్పోరేషన్ ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. సిఎం కెసిఆర్ తో త్వరలోనే ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. కేవలం తాను మాత్రమే కాదు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్నను కూడా తన వెంట తీసుకువెల్లి కార్పోరేషన్ సాధనకు ప్రయత్నిస్తాననని హామీ ఇచ్చారు.

సోమవారం నిజామాబాద్‌లో నగరంలో మున్నూరు కాపు సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్నూరు కాపుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న కోరారు. దీంతో ఎంపి కవిత పైవిధంగా స్పందించారు.
అలాగే వివిధ అంశాలపై కూడా కవిత మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారో...అదే వారి నిజమైన వైఖరి అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ ప్రజల బాగు కోసం ఎలా పనిచేస్తున్నారో మీకందికి తెలిసిన విసయమే అన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ, నిజామాబాద్ సమగ్రాభివృద్ధికి వారు చేస్తున్నకృషిని కళ్లారా చేశారు కాబట్టి మరోసారి వారికే అవకాశాన్నివ్వాలని కవిత కోరారు.
నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ. 900 కోట్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఓ మున్సిపల్ కార్పోరేషన్‌కు అంత పెద్ద మొత్తం నిధులను మంజూరుచేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. ముఖ్యమంత్రికి నిజామాబాద్ నగర అభివృద్ధిపై ఎంత ప్రేమ ఉందో ఈ విషయం తెలియజేస్తుందని వివరించారు. 350 కొత్త రోడ్లు వేశామని, వీటిలో 200 కు పైగా రోడ్ల పనులు పూర్తయినట్లు ఎంపి కవిత చెప్పారు. అండర్ డ్రయినేజి, బ్యూటిఫికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మేయర్ ఆకుల సుజాత, బాజిరెడ్డి జగన్, ఓలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడీల రాములు, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.