Asianet News TeluguAsianet News Telugu

రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్: ఎంపీ కవిత

వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని నిజామాబాద్ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పర్యటించిన కవిత కేసీఆర్‌ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Trs mp kavitha critics congress tdp alliance
Author
Nizamabad, First Published Sep 28, 2018, 2:59 PM IST

నిజామాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని నిజామాబాద్ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పర్యటించిన కవిత కేసీఆర్‌ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారని ఇక ప్రజలెలా ఆమోదిస్తారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీల అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు.

మరోవైపు రేవంత్‌రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేదని ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. 

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్‌లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా రెండు రోజులుగా ఐటీ మరియు డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios