గొర్రెల కాపరిని సర్‌ప్రైజ్ చేసిన ఎంపీ కవిత ( వీడియో)
నిజామాబాద్ ఎంపీ కవిత గొర్రెల కాపరిని సర్‌ప్రైజ్ చేశారు. నిన్న సాయంత్రం నిజామాబాద్ పర్యటనకు వెళ్తున్న కవితకు మార్గమధ్యంలో గోపనపల్లి శివారులో గొర్రెల మంద కనిపించింది.
నిజామాబాద్ ఎంపీ కవిత గొర్రెల కాపరిని సర్‌ప్రైజ్ చేశారు. నిన్న సాయంత్రం నిజామాబాద్ పర్యటనకు వెళ్తున్న కవితకు మార్గమధ్యంలో గోపనపల్లి శివారులో గొర్రెల మంద కనిపించింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించి కిందకు దిగారు...
ఎవరో కారులో వెళ్తున్నారులే అనుకున్న గొర్రెల కాపరి.. కారు దిగి తనవైపు నడుచుకుంటూ వస్తున్న కవితను చూసి ఆశ్చర్యపోయాడు... అనంతరం కవిత... గొర్రెల కాపరితో మాటలు కలిపాడు. తన పేరు మల్లన్న అని పక్కనే ఉన్న గోపనపల్లి అని చెప్పాడు..
జీవాలు ఎట్లా ఉన్నాయ్..జబ్బులు ఏమైనా వస్తున్నాయా..అంబులెన్సులు వస్తున్నాయా అని కవిత అడగ్గా.. ‘‘జీవాలు పెద్దగయినయ్ పైసలకు ఇబ్బంది లేదు.. రోగాలొస్తే ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది.. పది జీవాలు నాలుగు రోజుల్లో మంచిగయినయ్.. అని సంతోషంగా చెప్పాడు మల్లన్న.
"