నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... సీఐ పరిస్థితి విషమం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 12, Sep 2018, 5:32 PM IST
nirmal road accident
Highlights

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి,  నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు. తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ తో పాటు అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు.  

నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద సీఐ కారు యాక్సిడెంట్ కు గురయ్యింది. ఆదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ కు కారులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో కారు వీరిని ఢీ కొట్టింది. దీంతో కారును డ్రైవ్ చేస్తున్న సీఐ జూపాల కృష్ణమూర్తి, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైదరాబాద్ కు తరలించిన చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలపాలవడంతో పాటు అధికంగా రక్తస్రావమవడంతో సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

 తెలుగు రాష్ట్రాల్లో ఆగని ఆర్టీసి ప్రమాదాలు... మరో బస్సు ప్రమాదంలో నలుగురు మృతి

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

loader