నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణను తాను ఎలా నమ్మింది. ఎందుకు ఎవరికీ హత్య విషయం చెప్పలేదో నిహారిక ఇలా చెప్పింది. 

హైదరాబాద్ : హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసులో హరి హర కృష్ణను ,అతడి ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో బయటికి వస్తున్న విషయాలు. . నిహారికతో ప్రేమ కారణంగానే నవీన్ ను హత్య చేసినట్లుగా హరి హరే కృష్ణ ఇదివరకే చెప్పాడు. అంతేకాదు నవీన్ హత్య విషయం తమకు తెలిసికూడా చెప్పొద్దనే ఎవరికి తెలియలేనివ్వలేదని.. అలా హరి హర కృష్ణకు సహాయ పడ్డామని నిహారిక, హాసన్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. 

నవీన్ హత్య విషయం గురించి నిహారిక మాట్లాడుతూ.. నవీన్ హత్య గురించి తెలిసిన భయంతో ఎవరికీ చెప్పలేదంది. నవీన్ హత్య తర్వాత హరి హరికృష్ణ తనను నాలుగు సార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది, నవీన్ తాను ప్రేమించుకున్నామని ఆ మాట నిజమేనని.. అయితే, అతనితో బేకప్ అయిన తర్వాత హరిహర కృష్ణతో తాను దగ్గరయ్యానని చెప్పింది.

నిహారిక చెప్పిన మొత్తం విషయాలు ఇలా ఉన్నాయి.. ఇంటర్ చదువుతున్నప్పుడే నేను, నవీన్ ప్రేమించుకున్నాం. . ఈ క్రమంలోనే మా ఇంట్లోనే మేమిద్దరం చాలాసార్లు కలుసుకునే వాళ్ళం. ఆ క్రమంలో ఎప్పుడైనా నవీన్ తో నేను గొడవ పడితే హరిహర కృష్ణే మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో ఎప్పుడు గొడవ జరిగినా హరి హర కృష్ణతో తన బాధను చెప్పుకునేదాన్ని అని తెలిపింది. 

కొద్ది కాలానికి నవీన్ తో బ్రేకప్ అయ్యింది. ఈ విషయం తెలిసిన తర్వాత హరిహర కృష్ణ తాను కూడా ఎప్పటి నుంచో నన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి చెప్పాడు. దీంతో ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం కూడా నవీన్ నాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ విషయాన్ని హరికి చెప్ప చెప్పాను. దీంతో నవీన్ మీద కోపంతో హరికృష్ణ రగిలిపోయేవాడు. అయితే అదంతా సరదాకి ఏమో అని నేను అనుకునేదాన్ని. అయితే, నవీన్ ను చంపేసి.. నిన్ను కిడ్నాప్ చేస్తానని చెబుతుండేవాడు. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోతా అనేవాడు. ఆ సమయంలో నేను తిడితే.. జోక్ అంటూ తేల్చేసేవాడు. 

ఈ క్రమంలోనే ఓ రోజు హరి వాళ్లింటికి తీసుకెళ్లి.. కత్తి, గ్లౌజులు చూపించాడు. నవీన్ ను వీటితో చంపేయడానికి ప్లాన్ చేశానని చెప్పాడు. నేను తిట్టాను. అలా చేయద్దని నవీన్ తో నేను మాట్లాడడం లేదని.. అతను కూడా మెల్లిగా మర్చిపోతాడు.. మనం సంతోషంగా ఉందామని చెప్పాను. హరి విన్నాడనుకున్నా.. హత్యకు రెండు రోజుల ముందు హరి నాకు కాల్ చేశాడు. ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నామని చెప్పాడు. 

అంతేకాదు నవీన్ మళ్లోసారి కాల్ చేస్తే నేను వేరేవాళ్లతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడు. ఆ రోజు పార్టీలో హరి ఫోన్ నుంచే నవీన్ నాకు కాల్ చేశాడు. హరి చెప్పమన్నట్లే చెప్పాను. దీంతో నవీన్ ఎందుకలా చేస్తున్నావంటూ అడిగాడు. నేను వెంటనే కాల్ కట్ చేశా. ఆ తరువాత హరినాకు కాల్ చేసి.. ఇక మీదట నవీన్ నీతో మాట్లాడడట అని తెలిపాడు. సరే అనుకున్నా.

ఆ రోజు పొద్దున హరి నన్ను కలవాలని మెసేజ్ చేస్తే వెళ్ళాను.. వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కనున్న గల్లీలో రోడ్డుమీదకి పాత బట్టలు వేసుకుని వచ్చి కలిశాడు. ఆ అవతారం చూసి షాక్ అయ్యా. ఏంటిది అని ప్రశ్నించా. నవీన్ ను చంపేశానని అప్పుడు చెప్పాడు. వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలని.. నవీన్ ను చంపిన విషయం ఎవరీకీ చెప్పొద్దని కోరాడు. డబ్బులు ఇచ్చి వచ్చేశా. విషయం ఎవరికి చెప్పొద్దనుకున్నా..

ఫిబ్రవరి 20న కాలేజీ నుంచి వస్తుంటే హరి ఫోన్ చేసి.. ఎల్బీనగర్ బస్టాప్ లో కలిశాడు. నవీన్ ను చంపిన ప్రాంతం మొత్తం చూపించాడు. అప్పటికే నవీన్ ఫ్రెండ్స్ నాకు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. హరి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారు. ఆ తరువాత 23వ తేదీన హసన్ ఫోన్ చేసి హరి మిస్సింగ్ అని చెప్పాడు. వాళ్ల అక్కాబావలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని.. ఫోన్లో ఏవైనా మెసేజ్ లు ఉంటే డిలీట్ చేయమని చెప్పాడు. నేను అలాగే చేశారు. 

ఫిబ్రవరి 24న నేను, నా ఫ్రెండ్ హరిని బస్టాప్ లో కలిసి చాలాసేపు మాట్లాడం. అప్పుడే పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. శరీనభాగాలను చంపిన స్తలంలో వేయమని హసన్ కి చెప్పాడట. ఆ తరువాత హరి మా ఇంటికి వచ్చి స్నానం చేశాడు. మా బావ అడ్వకేట్ కావడంతో అతనితో మాట్లాడాలని చెప్పాను. కాకపోతే నవీన్ హత్య గురించి చెప్పాం. వెంటనే పీఎస్ లో సరెండర్ అవ్వాలని ఆయన చెప్పాడు. అలా హరి లొంగిపోయాడు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పడంతో హత్య గురించి ఎవ్వరికీ చెప్పలేదు అని చెప్పుకొచ్చింది.