తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను నైట్ కర్ఫ్యూ అమలు చేయడంతో మెట్రో రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. రాత్రి 7:45 గంటలకే చివరి మెట్రో రైలును నడపనున్నట్టుగా హెచ్ఎంఆర్ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను నైట్ కర్ఫ్యూ అమలు చేయడంతో మెట్రో రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. రాత్రి 7:45 గంటలకే చివరి మెట్రో రైలును నడపనున్నట్టుగా హెచ్ఎంఆర్ ప్రకటించింది.ఇవాళ్టి నుండి ఈ నెల 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
also read:తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: 10 గంటలలోపు డిపోలకు ఆర్టీసీ బస్సులు
దీంతో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. రాత్రి 7:45 గంటలకే చివరి రైలును నడుపుతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. చివరి స్టేషన్ రైలు రాత్రి 8:45 గంటలకు చేరుకొంటుందని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. ఉదయం ఆరున్నర గంటలకే తొలి రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుందని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు, వాడాలని మెట్రో అధికారులు తెలిపారు.తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుండి అమలు చేస్తోంది. తద్వారా కేసుల వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.