Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: 10 గంటలలోపు డిపోలకు ఆర్టీసీ బస్సులు

రాత్రి 10 గంటలలోపుగా అన్ని బస్సులు ఆయా డిపోల్లోకి చేరుకొంటాయని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు తెలిపారు.

night curfew in Telangana:RTC buses will be returning before 10 pm to bus depots lns
Author
Hyderabad, First Published Apr 20, 2021, 1:27 PM IST

హైదరాబాద్:రాత్రి 10 గంటలలోపుగా అన్ని బస్సులు ఆయా డిపోల్లోకి చేరుకొంటాయని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  తెలంాణ ప్రభుత్వం  ఇవాళ రాత్రి నుండి  నైట్ కర్ఫ్యూను విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.  మే 1వ తేదీ వరకు  నైట్ కర్ప్యూ అమల్లో ఉంటుంది.

also read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

నిత్యావసర, అత్యవసర సరులకు రవాణాకు  నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ల నుండి  ఇళ్లకు వచ్చేవారంతా టికెట్లను చూపాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటల నుండి నైట్ కర్ఫ్యూ విధించడంతో  రాత్రి 10 గంటలలోపుగా ఆర్టీసీ బస్సులన్నీ  ఆయా డిపోలకు  చేరుతాయని  ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు విషయమై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో డీజీపీ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత  నైట్ కర్ప్యూపై పకడ్భందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ దిశా నిర్ధేశం చేయనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios