దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుమోటోగా తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్సీ
దిశ నిందితుల ఎన్‌క్ౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.
హైదరాబాాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటోగా తీసుకొంది జాతీయ మానప హక్కుల సంఘం.
Also read:కేసీఆర్ ఆగ్రహం ఇదీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తలసాని
గత నెల 27వ తేదీన చటాన్‌పల్లి వద్ద దిశను నలుగురు నిందితులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశారు.
Also read:దిశ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్: నాడు సజ్జనార్, నేడు పోలీసులను ఎత్తుకొని డ్యాన్స్
పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది.
Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య
త్వరలోనే సంఘటన స్థలాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సంఘటన స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటన స్థలాన్ని ఎప్పుడు పరిశీలించనుందో అనే విషయమై మరికొద్దిసేపట్లో తేలనుంది.
జాతీయ మానవహక్కుల సంఘం తెలంగాణ పోలీసులకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై తెలంగాణ పోలీసులు ఏం సమాధానం ఇస్తారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.