హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ‌దేశానికి మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉందని  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

Also read:దిశ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్‌: నాడు సజ్జనార్‌, నేడు పోలీసులను ఎత్తుకొని డ్యాన్స్

శుక్రవారం నాడు చటాన్‌పల్లిలో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మీడియాతో మాట్లాడారు..నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య

కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువ అంచనా వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉగ్రరూపం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన చెప్పారు.  కేసీఆర్ సైతం జాతీయ నేతలు కూడ ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన  అభిప్రాయపడ్డారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

దిశ  ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి..ఇదే విషయాన్ని తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు.